అమెరికాలో హన్మకొండ జిల్లా యువకుడు దుర్మరణం..
అమెరికాలో హన్మకొండ జిల్లా యువకుడు దుర్మరణం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి చెందిన ఘటన బాధిత కుటుంబంలో విషాదం నింపింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.అమెరికాలోని మిన్నెసోటాలో మాదన్నపేట వాసి బండి వంశీ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం గత సంవత్సరం అమెరికా వెళ్లిన వంశీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతదేహాన్ని …
![అమెరికాలో హన్మకొండ జిల్లా యువకుడు దుర్మరణం.. అమెరికాలో హన్మకొండ జిల్లా యువకుడు దుర్మరణం..](https://cknewstv.in/wp-content/uploads/2024/12/n64453196217349398460860fd34d87ab58eec3a72fe049f85f19364664c6cbfd60a66500a9811dfdcdae08.jpg)
అమెరికాలో హన్మకొండ జిల్లా యువకుడు దుర్మరణం..
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి చెందిన ఘటన బాధిత కుటుంబంలో విషాదం నింపింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.అమెరికాలోని మిన్నెసోటాలో మాదన్నపేట వాసి బండి వంశీ మృతి చెందాడు.
ఉన్నత చదువుల కోసం గత సంవత్సరం అమెరికా వెళ్లిన వంశీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
తమ కుమారుడి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. వంశీ కాంకోర్డియా సెయింట్ పాల్ వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.
మిన్నెసోటాలోని మాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రెయిరీ అపార్ట్మెంట్లోని రూం నెంబర్ 206లో వంశీ ఉంటున్నాడు. డిసెంబర్ 21న సెల్లార్లో పార్క్ చేసిన కారులో వంశీ ఉరి వేసుకున్న స్థితిలో విగత జీవిగా కనిపించాడు. ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్లు వంశీని ఆ స్థితిలో చూసి షాకయ్యారు.
హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. వంశీ ఉంటున్న పక్క అపార్ట్మెంట్లోనే వరంగల్ జిల్లా కంఠాత్మకూర్ కు చెందిన యువకుడు వంశీ పేరెంట్స్కు కాల్ చేసి సమాచారం అందించాడు.
ఇలా వంశీ చనిపోయిన విషయం అతని తల్లిదండ్రులకు తెలిసింది. వంశీ తండ్రి కల్లుగీత కార్మికుడు. సొంత పొలం సాగుచేసుకుంటూ కష్టపడి ఇద్దరి కొడుకులను ఏ లోటు లేకుండా చూసుకున్నాడు.
వంశీ ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి చేరుకుంటాడని అతని తల్లిదండ్రులు కలలు కన్నారు. అమెరికాలో వంశీ ఇలా అర్థాంతరంగా అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో అతని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)