ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు అసమ్మతి సెగ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరుపై యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్లకు వ్యతిరేకంగా పోటీలో నిలిచి గెలిచిన జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గెలుపొందిన బుగ్గ శ్రీనివాస్‌, యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆదివారం మోటకొండూరులో సన్మాన కార్యక్రమంతోపాటు భారీ …

ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు అసమ్మతి సెగ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరుపై యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్లకు వ్యతిరేకంగా పోటీలో నిలిచి గెలిచిన జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గెలుపొందిన బుగ్గ శ్రీనివాస్‌, యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆదివారం మోటకొండూరులో సన్మాన కార్యక్రమంతోపాటు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ బీర్లను ఆహ్వానించలేదు. ఆయన వర్గమని చెప్పుకునే ఇతర నాయకులను సైతం యూత్‌ కాంగ్రెస్‌ పక్కన పెట్టింది.

ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో లేకుండా చేశారు. ఎమ్మెల్యే అయిలయ్య సీనియర్‌ యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులను విస్మరించి పార్టీకి సంబంధం లేనివారిని అందలమెక్కిస్తున్న తీరును యూత్‌ విభాగం తప్పుబట్టింది అంటూ సమాచారం.

Updated On 23 Dec 2024 2:57 PM IST
cknews1122

cknews1122

Next Story