గాంధీ భవన్లో అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి
తాజాగా అసెంబ్లీలో ఈ అంశం మీద రేవంత్ రెడ్డి స్పందించగా తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన మీద అభాండాలు వేస్తున్నారని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే తాజాగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు వెళ్లారు ఈరోజు ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ నేపద్యంలో అక్కడికి వెళ్ళిన చంద్రశేఖర్ రెడ్డి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీడియా సమావేశం అనంతరం తన ఛాంబర్ లోకి వెళ్లిన ఆమెను చంద్రశేఖర్ రెడ్డి అనుసరించారు. చాంబర్లోకి వెళ్లిన తర్వాత ఆయనతో మాట్లాడేందుకు దీపా దాస్ మున్షీ నిరాకరించారు.
దీంతో వెంటనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెంటనే గాంధీభవన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. విలేకరులు ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేసిన సరిగా స్పందించలేదని తెలుస్తోంది. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని తన పార్టీ నేతలు కలవడానికి వచ్చాను అంటూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి. గతంలో ఆయన బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించేవారు తర్వాత కాంగ్రెస్లోకి మారారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్లు అర్జున్కి ఈ మధ్య గ్యాప్ పెరిగిపోతోందనే ప్రచారం నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.