అల్లు అర్జున్ ఇంటి ముందు పరదాలు కట్టిన సిబ్బంది
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్‌పై ఇదివరకే కేసు నమోదైంది. గతంలోనే బన్నీని అరెస్టు చేయడం, కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
తాజాగా చిక్కడపల్లి పోలీసులు విచారణకు రావాలంటూ హీరోకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన లాయర్లతో కలిసి మంగళవారం (డిసెంబర్ 24న) పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
ప్రస్తుతం బన్నీని పోలీసులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటి ముందు పరదాలు కట్టారు. ఇంటి గేటును పరదాలతో మూసివేశారు. ఇంటి లోపలి మనుషులు ఎవరూ బయట మీడియాకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఏం జరిగింది?
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అభిమానులతో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ రాగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు అటు థియేటర్ యాజమాన్యంతో పాటు ఇటు హీరో అల్లుఅర్జున్‌పైనా కేసు నమోదు చేశారు. ఇటీవల జైలుకు వెళ్లిన ఆయన బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా విచారణ నిమిత్తం మరోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.