ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం హెదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న అండర్‌పాస్‌ వైపు ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హన్మకొండకు 33 మంది ప్రయాణికులతో బయల్దేరింది. మార్గమధ్యలో యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం …

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

హెదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న అండర్‌పాస్‌ వైపు ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హన్మకొండకు 33 మంది ప్రయాణికులతో బయల్దేరింది.

మార్గమధ్యలో యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్దకు రాగానే హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న అండర్‌పాస్‌ బ్రిడ్జి వైపు అదుపుతప్పి దూసుకెళ్లింది.

ఇనుప చువ్వలను తాకి బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఒకరిమీద ఒకరు పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై సరైన ఇండికేషన్‌ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Updated On 24 Dec 2024 1:15 PM IST
cknews1122

cknews1122

Next Story