మీ ఇంటి వాచీలో నా బొమ్మ ఉంది గుర్తు పట్టారా…? నేను మీ పొంగులేటి శీనన్నను అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనలో మహిళా కూలీలతో ముచ్చట సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని హామీ అశ్వారావుపేట : ఏం అక్కాచెల్లమ్మలు బాగున్నారా… సొంత ఇళ్లున్నాయా మీకు….ఇంతకీ నేనేవరో తెలుసా…? మీ ఇంటి వాచీలో నా బొమ్మ ఉంది గుర్తు పట్టారా…? అంటూ మహిళా కూలీలతో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాసేపు …

మీ ఇంటి వాచీలో నా బొమ్మ ఉంది గుర్తు పట్టారా…?

  • నేను మీ పొంగులేటి శీనన్నను
  • అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనలో మహిళా కూలీలతో ముచ్చట
  • సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని హామీ

అశ్వారావుపేట : ఏం అక్కాచెల్లమ్మలు బాగున్నారా… సొంత ఇళ్లున్నాయా మీకు….ఇంతకీ నేనేవరో తెలుసా…? మీ ఇంటి వాచీలో నా బొమ్మ ఉంది గుర్తు పట్టారా…? అంటూ మహిళా కూలీలతో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాసేపు సరాదాగా ముచ్చటించారు.

అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనకు గురువారం వచ్చిన ఆయన అశ్వారావుపేట మండలంలో తన పర్యటనను ముగించుకుని ములకలపల్లి వెళ్తూ మార్గమధ్యలో శనగకాయలు శుభ్రపరుస్తున్న మహిళా కూలీలను చూసి ఆగారు. వారితో పై విధంగా కాసేపు సరాదాగా సంభాషించారు….

చేతికి గాజులు వేయించుకోమని చెప్పి కొంత నగదును అందించారు. అదేవిధంగా కొద్ది దూరం వెళ్ళాక మరొక ప్రాంతంలో ఆగి అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడి సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని నచ్చినట్టు కట్టుకోమని హామీ ఇచ్చారు.

Updated On 26 Dec 2024 4:14 PM IST
cknews1122

cknews1122

Next Story