మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan singh) తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఈ ఏడాది ప్రథమంలో …

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan singh) తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు.

92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఈ ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రాత్రి 8 గంటల సమయంలో ఆయనను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) అత్యవసర విభాగంలో చేర్చారు..

పదేళ్లు ప్రధానిగా..

డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారధ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. 33 ఏళ్ల రాజకీయ అనుభవం తర్వాత రాజ్యసభలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ముగించారు. 1991 జూన్ లో పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.

రాజ్యసభలో..

ఆ తరువాత నాలుగు నెలలకు 1991లో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఎగువ సభలో ఐదుసార్లు అస్సాంకు ప్రాతినిధ్యం వహించిన ఆయన 2019లో రాజస్థాన్ కు మారారు. పెద్దనోట్ల రద్దును 'వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధమైన దోపిడీ'గా అభివర్ణిస్తూ ఆయన చివరిసారిగా పార్లమెంటులో ప్రసంగించారు. నిరుద్యోగం అధికంగా ఉందని, అసంఘటిత రంగం అతలాకుతలమైందని, 2016లో తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడిన సంక్షోభం అని ఆయన విమర్శించారు.

Updated On 26 Dec 2024 10:52 PM IST
cknews1122

cknews1122

Next Story