వైరా ఆర్టీసీ బస్ స్టాండ్ లో జేబు దొంగల హల్చల్… వైరాలోని ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం జేబుదొంగలు హల్చల్ చేశారు. ముగ్గురు ప్రయాణికుల బ్యాగులు కట్ చేసి రూ.60 వేల విలువైన సొత్తును చోరీ చేశారు. వైరా ఆర్టీసీ బస్టాండ్ లో కొణిజర్ల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన అడపా రంగనాయకులు ఖమ్మం వైపు వెళ్లే బస్సు ఎక్కుతుండగా అతడి వద్ద ఉన్న 54 వేల రూపాయల నగదు దొంగలు అపహరించారు. అలాగే వైరా మండలం …

వైరా ఆర్టీసీ బస్ స్టాండ్ లో జేబు దొంగల హల్చల్…

వైరాలోని ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం జేబుదొంగలు హల్చల్ చేశారు. ముగ్గురు ప్రయాణికుల బ్యాగులు కట్ చేసి రూ.60 వేల విలువైన సొత్తును చోరీ చేశారు.

వైరా ఆర్టీసీ బస్టాండ్ లో కొణిజర్ల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన అడపా రంగనాయకులు ఖమ్మం వైపు వెళ్లే బస్సు ఎక్కుతుండగా అతడి వద్ద ఉన్న 54 వేల రూపాయల నగదు దొంగలు అపహరించారు.

అలాగే వైరా మండలం గండగలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు జగ్గయ్యపేట బస్సు ఎక్కుతుండగా జేబు దొంగలు చాకుతో బ్యాగులు కట్ చేసి ఎనిమిది వేల రూపాయల విలువైన బంగారం, నగదును చోరీ చేశారు.

బస్సులో టికెట్లు తీసుకునేందుకు బ్యాగులు చూసుకోగా ఆధార్ కార్డులతో సహా చోరీ కావడంతో బాధితులు వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంఘటన తెలుసుకున్న పోలీసులు వైరా ఆర్టీసీ బస్టాండ్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. వైరా ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాలు ఉన్నా అవి నిరుపయోగంగా మారాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated On 27 Dec 2024 10:05 AM IST
cknews1122

cknews1122

Next Story