రూ.95 లక్షల టాటా ఏఐయూ బీమా చెక్కు పంపిణీ చేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
- వైరాకు చెందిన లబ్ధిదారురాలికి అందజేత
- టాటా సంస్థ సేవలను కొనియాడిన రామసహాయం
ఖమ్మం: వైరాకు చెందిన చెరుకుపల్లి సీతయ్య అనే ఓ ప్రైవేటు చిరుద్యోగి అక్టోబర్ నెలలో తన ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై.. చనిపోగా అతడి కుటుంబానికి టాటా ఏఐయూ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన బీమా చెక్కును ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అందజేశారు. జెడ్పీ సెంటర్లో గల టాటా ఏఐయూ కార్యాలయానికి ఎంపీ రఘురాం రెడ్డి శనివారం వెళ్లి.. కంపెనీ ఉద్యోగులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తో కలిసి రూ. 95 లక్షల చెక్కును మృతుడి భార్య చెరుకుపల్లి శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ..టాటా కంపెనీ వారు ఇంత పెద్ద మొత్తంలో బీమా అందించి..బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని అన్నారు.
రతన్ టాటాకు ఎంపీ నివాళి..
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా జయంతి సందర్భంగా..టాటా ఏఐయూ ఆఫీసులో టాటా చిత్రపటానికి ఎంపీ రామసహాయం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. టాటా సంస్థ అంటే.. ప్రజలకు ఎనలేని నమ్మకం అని అన్నారు. వ్యాపారం, దాతృత్వంలో సాటి లేరని తెలిపారు. టాటా ట్రస్ట్ ద్వారా.. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఇదే నమ్మకాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉద్యోగులను కోరారు.
ఈ కార్యక్రమంలో..: టాటా ఏఐయూ ఉన్నతాధికారి సురభి ముకుంద రామ, కాంగ్రెస్ నాయకులు స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, ఇతర అధికారులు, ఉద్యోగులు శ్వేత, వి.వినోద్ కుమార్, దేవరపు రమేష్, ఉప్పలయ్య, వరప్రసాద్, నాగేందర్ రెడ్డి, కే. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.