లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్…
కరీంనగర్ జిల్లా లో మరో అవినీతి చేప ఏ సి బి కి చిక్కింది.ఓ రైతు వద్ద నాల కన్వర్షన్ కోసం పది వెలు డిమాండ్ చేసినా డిప్యూటీ తహసీల్దార్ ఆరు వెలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన కలకుంట్ల నవీన్ రావు అనే రైతు కు చెందిన రెండు గుంటలు వ్యవసాయ భూమి నాల కన్వర్షన్ కోసం పది రోజుల క్రితం దరఖాస్తు చేశాడు.
దీంతో డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం పది వేలు లంచం డిమాండ్ చేశాడు.ఆరు వెలు ఇస్తా అని ఒప్పుకున్న నవీన్ రావు ఏ సి బి అధికారులను ఆశ్రయించాడు.
దీంతో రంగం లో దిగిన ఏ సి బి అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో ఆరు వెలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.