108 కేజీల బెల్లం పట్టివేత..
అశోక్ లేలాండ్ ట్రక్ స్వాధీనం.
ఒక వ్యక్తి అరెస్ట్.. పరారీ లో ఒకరు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
డిసెంబర్ 28,
ఆశ్వాపురం మండలం పిచ్చుకల తండా గ్రామానికి చెందిన బదావత్ కోటేశ్వర రావు, కొత్తగూడెం పెద్ద బజారుకు చెందిన సంజయ్ లడ్డ ఇద్దరు కలిసి నాటుసారా తయారీకి వాడు ముడి పదార్థాలు అయినా బెల్లం, పటికలు తమ దగ్గర ఉన్న ట్రక్ లో కొత్తగూడెం నుంచి తీసుకు వచ్చి పిచ్చుకల తండ గ్రామ శివారు న అటవీ ప్రాంతంలో బట్టీ పెట్టి నాటుసారా తయారు చేసి చుట్టు ప్రక్కల గ్రామాలలో అమ్మకాలు జరుపుతున్నారాన్న కచ్చితమైన సమాచారం మేరకు కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరియు మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది దాడులు నిర్వహించి (108) కేజీల బెల్లం, (05)కేజీల పటిక, (02) లీటర్ల నాటుసారా, అశోక్ లేలాండ్ ట్రక్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీన పర్చుకొని, (100) లీటర్ల బెల్లం పానకం సంఘటన స్థలంలో ధ్వంసం చేసినట్లు, వారివురి మీద కేసు నమోదు చేసినట్లు మణుగూరు ఎక్సైజ్ సీ ఐ రాజిరెడ్డి తెలిపారు.
ఈ తనిఖీల్లో ఎస్.ఐ లు గౌతమ్, కిషోర్ బాబు సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, గురవయ్య, సుమంత్, రమేష్, ప్రసన్న, శ్రీను, అమల పాల్గొన్నారు.