చార్టెడ్ అకౌంటెంట్ జాబితాలో మరో ఇద్దరు పలమనేరు సిఏ లు పలమనేరు నియోజకవర్గం డిసెంబర్ 28 సీకే న్యూస్ నిన్న ఐ సి ఏ ఐ విడుదల చేసిన చార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో పలమనేరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పలమనేరుకు చెందిన రిషబ్ ఓస్వాల్ మొదటి ర్యాంకు సాధించాడు. పలమనేర్ పట్టణానికి చెందిన శశి శ్రీనివాస్ సీఏ ఫైనల్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. చిన్ననాటి నుంచి వీరిద్దరూ …

చార్టెడ్ అకౌంటెంట్ జాబితాలో మరో ఇద్దరు పలమనేరు సిఏ లు

పలమనేరు నియోజకవర్గం డిసెంబర్ 28 సీకే న్యూస్

నిన్న ఐ సి ఏ ఐ విడుదల చేసిన చార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో పలమనేరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

పలమనేరుకు చెందిన రిషబ్ ఓస్వాల్ మొదటి ర్యాంకు సాధించాడు. పలమనేర్ పట్టణానికి చెందిన శశి శ్రీనివాస్ సీఏ ఫైనల్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు.

చిన్ననాటి నుంచి వీరిద్దరూ క్లాస్మేట్స్ మరియు ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు….ఈ మాస్ హై స్కూల్లో విద్యను అభ్యసించారు.

చిన్న నాటి నుండి ఇద్దరు చదువులో చురుగ్గా ఉండేవారు. ఐ సి ఎస్ సి బోర్డు పదవ తరగతిలో 97% ,96% తో ఈమాస్ స్కూల్లో రికార్డు సృష్టించారు.

ఇక ఇంటర్మీడియట్ నుండి సీఏ వరకు గుంటూరు మాస్టర్ మైండ్స్ లో ర్యాంకుల పరంపర కొనసాగిస్తూనే వచ్చారు.సి ఎ ఫౌండేషన్ లో, ఆల్ ఇండియా ఒకటి రెండు .సీఎం ఎ ఫౌండేషన్ లో ఆల్ ఇండియా 1,3 సీఏ ఇంటర్లో ఆల్ ఇండియా 8,10 సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 1.3
ర్యాంకులు సాధిస్తూ…పలమనేరు ఖ్యాతిని దేశస్థాయిలో తీసుకుని వెళ్లి, కలకత్తాలో, ఇద్దరికీ రెండుసార్లు ఆ రాష్ట్ర గవర్నర్ చేత సన్మానం చేయించుకున్నారు.

అదే ఒరవడిని కొనసాగిస్తూ….సీఏ ఫైనల్ లో కూడా ప్రధమ ర్యాంకును రిషబ్ సాధించడం పట్ల ప్రజలు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.

సిఏ పాస్ కావడమే చాలా కష్టమని, అటువంటిది ఫైనల్ లో ఇద్దరు పాస్ కావడం పలమనేర్కే గర్వకారణమని, ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

ప్రస్తుతం ఇద్దరూ వరల్డ్ బిగ్ ఫోర్ కంపెనీ కే పి ఎం జి లో ఇంటర్న్ పూర్తి చేశారు.

ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు రాజేష్ ఓస్వాల్ భగీరధి లక్ష్మీపతి వ్యాపారస్తులు కావడం గమనార్హం

Updated On 28 Dec 2024 12:59 PM IST
cknews1122

cknews1122

Next Story