గర్ల్స్‌ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని విద్యార్థినుల ఆందోళన మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్‌రూముల్లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారు హాస్టల్‌లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో …

గర్ల్స్‌ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని విద్యార్థినుల ఆందోళన

మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

హాస్టల్ బాత్‌రూముల్లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

వీడియోలు తీసిన వారు హాస్టల్‌లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు. తమ గోప్యతకు భంగం కలిగించిన ఈ దారుణ ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కాలేజీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడి, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినుల ఆందోళనను తగ్గించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.

అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హాస్టల్‌లో విద్యార్థినుల భద్రతకు సంబంధించి ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కళాశాల యాజమాన్యం భద్రతా వ్యవస్థను సమీక్షించి, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు కోరుతున్నారు.

Updated On 2 Jan 2025 8:36 AM IST
cknews1122

cknews1122

Next Story