చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్‌పై ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల.. చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (hMPV) వ్యాప్తిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DGHS, NCDC డైరెక్టర్, కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనను విడుదల చేసింది.మెటాన్యూమోవైరస్ (hMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుందని తెలిపింది. ఇది శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ప్రత్యేకించి యువకులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులేవీ …

చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్‌పై ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల..

చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (hMPV) వ్యాప్తిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DGHS, NCDC డైరెక్టర్, కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనను విడుదల చేసింది.మెటాన్యూమోవైరస్ (hMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుందని తెలిపింది.

ఇది శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ప్రత్యేకించి యువకులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులేవీ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది..

రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల డేటాను ఆరోగ్య శాఖ విశ్లేషించింది. 2023తో పోలిస్తే 2024 డిసెంబర్‌లో గణనీయమైన పెరుగుదల లేదు.. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల పై పాటించాల్సిన జాగ్రత్తలను విడుదల చేసింది.

చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్నాయి. ఆస్పత్రుల మందు జనాలు బారులుతీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్‌గా కొట్టిపారేస్తోంది.

మరోవైపు.. అంతర్జాతీయ నివేదికలు ప్రస్తుతానికి చైనాకు ట్రావెల్ ప్లాన్స్‌ని పున:పరిశీలించాలని ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా చైనా వ్యాప్తంగా ముఖ్యంగా ఆ దేశ ఉత్తర ప్రాంతంలో HMPV వైరల్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.

దీంతో పాటు ఇన్‌ఫ్లూఎంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి కేసులతో అక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి.

లక్షణాలివే..

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు (HMPV Virus Sympotms) సైతం ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మారిదిగానే ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు.

దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి.

వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే నిమోనియా, బ్రాంకైటిస్కు దారితీయవచ్చు. 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడొచ్చు.

చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ.

దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లు, వైరస్ బారిన పడిన వారితో సన్నిహతంగా మెలిగితే ఇది వ్యాపించవచ్చు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

సబ్బుతో 20 సెకన్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.

తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు కవర్ చేసుకోవాలి. అనంతరం చేతులు శుభ్రం చేసుకోవాలి.

Updated On 4 Jan 2025 6:16 PM IST
cknews1122

cknews1122

Next Story