ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం సన్న బియ్యం పంపిణీ కొత్త మండల ఏర్పాటుపై క్యాబినెట్ లో చర్చ హైదరాబాద్: జనవరి 04సీఎం రేవంత్ రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో ఈరోజు నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలుపైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అజెండాలో 22 అంశాలు ఉన్నాయి. అందులో.. రైతు భరోసాకి …

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం

సన్న బియ్యం పంపిణీ కొత్త మండల ఏర్పాటుపై క్యాబినెట్ లో చర్చ

హైదరాబాద్: జనవరి 04
సీఎం రేవంత్ రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో ఈరోజు నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలుపైగా ఈ భేటీ కొనసాగింది.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అజెండాలో 22 అంశాలు ఉన్నాయి. అందులో..

రైతు భరోసాకి ఆమోదముద్ర

ఇందిరమ్మ ఇళ్లు

బీసీ రిజర్వేషన్లు

నూతన మండలాల ఏర్పాటు

రేషన్ కార్డుల జారీ

సన్న బియ్యం – ఎప్పటి నుంచి ఇవ్వాలి

అనే అంశాలపై చర్చించారు.

అంతేకాకుండా.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ 2 వ్యయం 1784 కోట్లకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.పాలమూరు- రంగారెడ్డి లో భాగంగా ఎదుల–డిండికి 1800 కోట్ల అంచనా వ్యయానికి క్యాబినెట్​ ఆమోదం తెలిపింది.

మరోవైపు.. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్‌లో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Updated On 4 Jan 2025 8:30 PM IST
cknews1122

cknews1122

Next Story