KhammamPoliticalTelangana

మోడీ చేసే మోసాలకు భారతరత్న ఇవ్వాలి

మోడీ చేసే మోసాలకు భారతరత్న ఇవ్వాలి

మోడీ చేసే మోసాలకు భారతరత్న ఇవ్వాలి

లక్ష కోట్ల అప్పు చేస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి

ఖమ్మం సొంత జిల్లాను అభివృద్ధి చేసుకోలేని ముగ్గురు మంత్రులు ఉన్నారు

వరద బాధితులకు ప్రభుత్వం చేసింది శూన్యం

సీతారామ ప్రాజెక్టు ఊసే లేదు
దోచుకోవడం దాచుకోవడమే సర్కార్ పని

విలేకరుల సమావేశంలో డాక్టర్ కే ఏ పాల్

సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం జనవరి 4: దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని అభివృద్ధిలో దూసుకుపోతామని ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశ ప్రజలను మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె ఏ పాల్ విమర్శించారు.

ఖమ్మంలోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో శనివారం సర్పంచ్ లు, ఎంపీటీసీలు మేధావులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులతో చర్చించి వారి అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కే ఏ పాల్ మాట్లాడుతూ…. దేశ ప్రధానిగా మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలం అయ్యారని, నిరుద్యోగం నానాటికి పెరిగిపోతుందని, రైతాంగ సమస్యలు పరిష్కరించలేక , అంబానీ, ఆదాని, బడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ ప్రజలను పట్టించుకోవటం మానేశారని దుయ్యబట్టారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు .బిజెపి ఆర్ఎస్ఎస్ వంటి శక్తుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుల మయంగా మారిందని, యాడాదికి లక్షన్నర కోట్ల అప్పు చేస్తుందని, ప్రతినెల పదివేల కోట్లుకు పైగాఅప్పు చేస్తూ ప్రజల నెత్తిన భారం మోపుతున్నారని ఆరోపించారు.

తమ్ముడు రేవంత్ రెడ్డి చేసే పాలన రాష్ట్రంలో అస్తవ్యస్తంగా తయారైందని, నిరుద్యోగులకు 15 వేలు కాదు కదా కనీసం 15 పైసలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు చేయటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

భద్రాచలం నుంచి ఖమ్మం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి ఆనవాళ్లు లేవని, అందుకే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి లు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాకు తక్షణమే పదివేల కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

10 లక్షలు ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం సీతారామ ప్రాజెక్టు ఊసే ఎత్తడం లేదని, రైతులకు సాగు నీరు అందించడంలో ఇట్లు రేవంత్ రెడ్డి అటు ఖమ్మం జిల్లా మంత్రులు వైఫల్యం చెందారని దుయ్యబట్టారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయలేదని, కనీసం బాధితులను పరామర్శ కూడా నామమాత్రంగా ఓదార్చి చేతులు దులుపుకున్నారని, బాధ్యతలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడం ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించేందుకు సీఎం తో సహా 10మంది మంత్రులు వచ్చిన తను ఒక్కడినే ఒకవైపు చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని అందుకు మీరు సిద్ధమా? అనే ఆయన సవాల్ చేశారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవటం దాచుకోవడానికే పరిమితమైందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉందని, అటువంటి వారికి భవిష్యత్తు ఉండదని అన్నారు.

తులం బంగారం, లక్ష రూపాయల సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.

100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా:-
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ ద్వారా గెలుపొందిన గ్రామాలలో వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని డాక్టర్ కే ఏ పాల్ అన్నారు.

ప్రజాశాంతి పార్టీ ద్వారా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఏకగ్రీవంగా చేసుకునే బాధ్యత తను తీసుకుంటానని, యువతీ యువకులు పెద్ద ఎత్తున తమ పార్టీని ఆదరించాలని వచ్చే ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉండేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

గెలిచిన గ్రామాలలో వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యా , వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, తాగునీరు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు వంద రోజుల్లో కల్పించి తీరుతామని సమావేశానికి వచ్చిన సర్పంచులకు భరోసాను ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీలో ప్రజలు పెద్ద ఎత్తున చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!