టాప్‌ ర్యాంకర్‌కు దక్కని జాబ్‌..! తండ్రి కోసం చిన్నారుల తపన.. వరంగల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పిదం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది.ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో డీఎడ్‌ పూర్తిచేశాడు. 2024లో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్జీటీ)లో డీఎస్సీ పరీక్ష రాయగా, జిల్లా స్థాయిలో 10వ ర్యాంకు వచ్చింది. మెరుగైన ర్యాంకు, రిజర్వేషన్‌ ఉండటం తో మహేందర్‌ ఉద్యోగానికి ఎంపికైనట్టు అధికారుల నుంచి సమాచారం అందిం ది. …

టాప్‌ ర్యాంకర్‌కు దక్కని జాబ్‌..! తండ్రి కోసం చిన్నారుల తపన..

వరంగల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పిదం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది.
ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో డీఎడ్‌ పూర్తిచేశాడు.

2024లో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్జీటీ)లో డీఎస్సీ పరీక్ష రాయగా, జిల్లా స్థాయిలో 10వ ర్యాంకు వచ్చింది. మెరుగైన ర్యాంకు, రిజర్వేషన్‌ ఉండటం తో మహేందర్‌ ఉద్యోగానికి ఎంపికైనట్టు అధికారుల నుంచి సమాచారం అందిం ది.

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ముగిసిన అనంతరం కౌన్సెలింగ్‌ అండ్‌ పోస్టింగ్‌ కోసం మరోసారి పిలుపువచ్చింది. తీరా కౌన్సెలింగ్‌కు వెళ్లగా లిస్టులో పేరు లేదు. డీఈ వో జ్ఞానేశ్వర్‌ను అడగటంతో స్టేట్‌ ఆఫీసుకు సర్టిఫికెట్లు పంపిస్తే అనర్హుడిగా పేర్కొన్నరంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తాను ఇగ్నోలో రెగ్యులర్‌గా, బెం గుళూరు యూనివర్సిటీలో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో డీఎడ్‌ చేసినట్టు మహేందర్‌ తెలిపారు.

తనతోపాటు వివిధ జిల్లాల్లో చదివిన 20మంది అభ్యర్థులకు ఇదే డీఎస్సీ లో ఉద్యోగాలు వచ్చినట్టు ఆధారాలతో చూపాడు. దీంతో కంగుతిన్న డీఈవో తప్పిదం చేసినట్టు తెలుసుకొని మహేందర్‌కు ఉద్యోగం వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని రోజూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు.

ఇదే విషయమై మహేందర్‌ గతంలో కలెక్టర్‌ సత్యశారదను కలిశాడు. స్పందించిన కలెక్టర్‌.. డీఈవోను తన కార్యాలయానికి పిలిపించుకొని మహేందర్‌కు న్యాయం చేయాలని ఆదేశించారు.

అయినా, 2 నెలలుగా ఉద్యోగం కోసం డీఈవో కార్యాలయం, స్టేట్‌ ఆఫీస్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. డీఈవో నిర్వాకంతోనే తనకు ఉద్యోగం రాలేదని మహేందర్‌ ఆరోపిస్తున్నాడు.

Updated On 4 Jan 2025 2:50 PM IST
cknews1122

cknews1122

Next Story