వాష్ రూంలో కెమెరాలు.. మరోసారి కలకలం విద్యాలయాలకు విద్యార్థినులు వెళ్లాలంటనే జంకుతున్నారు. పాఠశాలల్లో చదువుకునే బాలికల బాత్రూంలో మొబైల్ కెమెరాలు ఉన్నాయని ఈ మధ్య తరుచుగా వార్తలు వస్తున్నాయి. దీంతో బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యాలయాలకు బాలికలను పంపించాలంటేనే భయపడిపోతున్నారు. తెలంగాణలో ఈ మధ్య వరుసగా ఇలాంటి ఘటనలు బయట పడుతుండటంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంతమంది ఆకతాయిల్లో మాత్రం ఎలాంటి …
![వాష్ రూంలో కెమెరాలు.. మరోసారి కలకలం వాష్ రూంలో కెమెరాలు.. మరోసారి కలకలం](https://cknewstv.in/wp-content/uploads/2025/01/n64620366917359875161991ebd5c3dc338731821dc443bce525ab32f3cb7d33c0fa327334bcbd633b1a461.jpg)
వాష్ రూంలో కెమెరాలు.. మరోసారి కలకలం
విద్యాలయాలకు విద్యార్థినులు వెళ్లాలంటనే జంకుతున్నారు. పాఠశాలల్లో చదువుకునే బాలికల బాత్రూంలో మొబైల్ కెమెరాలు ఉన్నాయని ఈ మధ్య తరుచుగా వార్తలు వస్తున్నాయి.
దీంతో బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యాలయాలకు బాలికలను పంపించాలంటేనే భయపడిపోతున్నారు.
తెలంగాణలో ఈ మధ్య వరుసగా ఇలాంటి ఘటనలు బయట పడుతుండటంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంతమంది ఆకతాయిల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.
తాజాగా మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల బాత్రూంలో మొబైల్ కెమెరాల ఘటన కలకలం సృష్టిచింది. తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పోలీసులకు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిందితుడు నక్క సిద్ధార్థ అనే విద్యార్థిని సీఐ అప్పయ్య అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ఏబీవీపీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)