
అభివృద్ధి పనులలో అధికారుల నిర్లక్ష్యం….!
కాలువ తోవ్వారు కల్వర్టు మరిచారు…..!
అశోక్ నగర్ కాలనీలో మూడు నెలలు అవుతున్న పూర్తికాని కల్వర్టు నిర్మాణ పనులు…..
కల్వర్టు నిర్మాణ గుత్తేదారుడు పై చర్యలు తీసుకోవాలి……!
సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / భద్రాచలం ప్రతినిధి, (సాయి కౌశిక్),
ఆగస్టు 22,
ఓ పక్క వర్షాలు వరదలతో పట్టణంలో విష జ్వరాలు వ్యాపిస్తుంటే అధికారుల తీరులో మాత్రం మార్పు రాకపోవడంతో అభివృద్ధి పనులలో తీవ్ర జాప్యం నెలకొని స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి ఆరోపించారు. శుక్రవారం సిపిఐఎం 11 వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా పట్టణంలోని అశోక్ నగర్ రాఘవేంద్ర హోటల్ సందులో కల్వర్టు నిర్మాణం కోసం కాలువ తవ్వి సుమారు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పని పూర్తి కాకపోవడంతో మురుగు నీరు చేరి దోమలు పందులు సైరవిహారం చేస్తున్నాయని స్థానిక ప్రజలు సిపిఎం బృందం దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎం.వి నర్సారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులు కాంటాక్ట్ తీసుకునే గుత్తేదారుడు సకాలంలో పనులు పూర్తి చేయకపోతే అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని అన్నారు. కలవటం నిర్మాణం కోసం కాలువతవి రెండు నెలలు అవుతున్న ఇప్పటికీ పూర్తి చేయని గుత్తేదారులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ అధికారులకు ప్రజలపై లేదా అని ఆయన అన్నారు అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు ఇస్తా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని వెంటనే అశోక్ నగర్ కల్వర్టును పూర్తి చేయకపోతే ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని నర్సారెడ్డి హెచ్చరించారు.
అశోక్ నగర్ కాలనీలో అనేక రకాల సమస్యలు పేరుకుపోతున్న కనీసం అధికారులు ఎవరు అటువైపు వచ్చింది పరిస్థితి కూడా లేదని అన్నారు వెంటనే పంచాయతీ అధికారులు కాలనీలో పర్యటించి పారిశుద్ధ పనులను చేపట్టాలని నిర్మాణాలు ఉన్న కల్వర్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట్రామా రావు పారెల్లి సంతోష్ కుమార్ శాఖ కార్యదర్శి పుణ్యవతి జిల్లా కమిటీ సభ్యురాలు వై పూర్ణిమ నాయకులు ఘనపతమ్మ గుండ్ల రాణి సూరమ్మ సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు