డిప్యూటీ సీఎం భట్టికి తప్పిన పెను ప్రమాదం వరంగల్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతోరణం వద్ద భట్టి కాన్వాయ్‌లోని ఒక పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఎస్‌ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల …

డిప్యూటీ సీఎం భట్టికి తప్పిన పెను ప్రమాదం

వరంగల్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతోరణం వద్ద భట్టి కాన్వాయ్‌లోని ఒక పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాద ఘటనలో ఎస్‌ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యంగా ఉండాలని.. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందన్నారు.

Updated On 5 Jan 2025 5:58 PM IST
cknews1122

cknews1122

Next Story