గుర్తు తెలియని వాహనం ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి వరంగల్ నగరంలో ని మట్టెవాడలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి వాహనంతో పరారయ్యాడు డ్రైవర్. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం ఏఆర్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ శివనగర్ లోని మృతుడి స్వగృహానికి చేరుకొని రాజు పార్థివ దేహం పై పూలమాలలు వేసి ఘనని వాళ్లు …

గుర్తు తెలియని వాహనం ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి

వరంగల్ నగరంలో ని మట్టెవాడలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి వాహనంతో పరారయ్యాడు డ్రైవర్.

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం ఏఆర్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ శివనగర్ లోని మృతుడి స్వగృహానికి చేరుకొని రాజు పార్థివ దేహం పై పూలమాలలు వేసి ఘనని వాళ్లు అర్పించారు

స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం శివనగర్ కు చెందిన శ్రీరాం రాజు హనంకొండ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

శనివారం ఉదయం ఇంటి నుంచి కమీషనరేట్ లోని హెడ్ క్వార్టర్స్ కు విధుల నిమిత్తమై తన ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో ఎల్బీ కాలేజ్ సమీపంలో కారు ఢీకొనడం జరిగింది. కారు ఆపకుండా వెళ్లిపోయారు.

స్థానికులు స్పందించి వెంటనే 108కు సమాచారం అందించగా శ్రీరాం రాజును యంజీమ్ ఆసుపత్రిలో చేర్పించారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు తరలిస్తుండగా మార్గం మద్యలో రాజు మృతి చెందారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా మట్టేవాడ పోలీసులు కారును గుర్తించే క్రమంలో దర్యాప్తు తీవ్రతరం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి తరలించారు.

హెడ్ కానిస్టేబుల్ రాజు పార్థివ దేహం చూసేందుకు వందలాదిమంది తరలి వచ్చి ఘన నివాళులర్పించారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

మృతుడి భార్య శ్రీరామ్ శ్రీవిద్య ఫిర్యాదు మేరకు మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 6 Jan 2025 12:20 PM IST
cknews1122

cknews1122

Next Story