మరో కానిస్టేబుల్ ఆత్మహత్య ఇటీవల కాలంలో పోలీసు శాఖలో ఆత్మ హత్యలు కలకలం రేపుతున్న క్రమంలో తాజాగా మరో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… భాను శంకర్ వికారాబాద్ జిల్లా పరిగిలో కానిస్టేబుల్ గా గత కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతని కుటుంబం అంబర్పేట్ లోని మల్లిఖార్జున నగర్ లో నివాసముంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా …
మరో కానిస్టేబుల్ ఆత్మహత్య
ఇటీవల కాలంలో పోలీసు శాఖలో ఆత్మ హత్యలు కలకలం రేపుతున్న క్రమంలో తాజాగా మరో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… భాను శంకర్ వికారాబాద్ జిల్లా పరిగిలో కానిస్టేబుల్ గా గత కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతని కుటుంబం అంబర్పేట్ లోని మల్లిఖార్జున నగర్ లో నివాసముంటోంది.
ఈ నేపథ్యంలో ఆదివారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతి చెందిన కానిస్టేబుల్ గత ఐదేళ్లుగా ఫిట్స్ (మూర్ఛ) వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఫిట్స్ కారణంగా గత రెండేళ్లుగా మద్యానికి బానిసైయ్యాడని, మద్యం మత్తులోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాదమిక విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. కాగా మృతునికి భర్యా, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
కాగా ఆస్మాన్కడ్ బస్తీలో జనావత్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజులకు మరో కానిస్టేబుల్ భాను శంకర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.