ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్
95 శాతం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇందిరమ్మ లబ్దిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం ఇందిరమ్మ ఇండ్లు గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకురావడం జరిగింది గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమీషనర్ ద్వారా …
95 శాతం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి
ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది
ఇందిరమ్మ లబ్దిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం ఇందిరమ్మ ఇండ్లు గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకురావడం జరిగింది
గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమీషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. ఇందిరమ్మ ఇండ్ల పధకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది,
ఎలాంటి మధ్యవర్తులకు తావులేకుండా అర్హులైన వారికే ఇండ్లు మంజూరయ్యేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది. వీలైనంత త్వరితగతిన ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో 95 శాతం పూర్తికాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88 శాతం పూర్తయింది.
త్వరలో లబ్దిదారుల ఎంపిక పూర్తిచేసి ఇండ్ల నిర్మాణానికి చేపట్టవలసిన కార్యాచరణపై దృష్టి సారించాలని అలాగే అర్హులైన లబ్దిదారులకు ఇండ్లు అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించడం జరిగింది.