లంచం తీసుకుంటూ ఏసీబి కి పట్టుబడ్డ ప్రిన్సిపాల్, అటెండర్ అరెస్ట్...
లంచం తీసుకుంటూ ఏసీబి కి పట్టుబడ్డ ప్రిన్సిపాల్, అటెండర్ అరెస్ట్… ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు సి కే న్యూస్ ఇల్లందు నియోజకవర్గ ప్రతినిధి,జనవరి 09, భద్రాద్రికొత్తగూడెం ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. రూ. 2 వేలు లంచం తీసుకుంటూ ఉండగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ, అటెండర్ రామకృష్ణని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే పాఠశాలలో పని చేసే అవుట్ సోర్సింగ్ టీచర్ సంధ్యారాణి వద్ద …
లంచం తీసుకుంటూ ఏసీబి కి పట్టుబడ్డ ప్రిన్సిపాల్, అటెండర్ అరెస్ట్…
ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు
సి కే న్యూస్ ఇల్లందు నియోజకవర్గ ప్రతినిధి,
జనవరి 09,
భద్రాద్రికొత్తగూడెం ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. రూ. 2 వేలు లంచం తీసుకుంటూ ఉండగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ, అటెండర్ రామకృష్ణని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అదే పాఠశాలలో పని చేసే అవుట్ సోర్సింగ్ టీచర్ సంధ్యారాణి వద్ద రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబి డియస్పి రమేష్ బృందం పట్టుకున్నారు.
అవుట్ సోర్సింగ్ టీచర్ జీతం ఇవ్వాలంటే పదివేల రూపాయలు లంచం ఇవ్వాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేయడంతో, రూ. రెండువేలకు ఒప్పుకోవడంతో ఏసీబి అధికారులను అవుట్ సోర్సింగ్ టీచర్ ఆశ్రయించారు.
టీచర్ వద్ద రూ. రెండు వేలు తీసుకుంటుండగ ఏసీబి అధికారులు ప్రిన్సిపాల్ కృష్ణ, అటెండర్ రామకృష్ణను అరెస్టు చేశారు.