రాజన్న జిల్లాలో బాలిక కిడ్నాప్... ఏలాంటి ఆధారాలు లేకున్నా చాకచక్యంతో కేసును చేదించిన పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాల ను తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, …
రాజన్న జిల్లాలో బాలిక కిడ్నాప్...
ఏలాంటి ఆధారాలు లేకున్నా చాకచక్యంతో కేసును చేదించిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాల ను తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, లాస్య దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.
లాస్యకు మతిస్థిమితం లేకపోవడంతో మధు కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు.లాస్య తన కూతురు అద్విత(4) తో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శ నానికి వచ్చింది. దర్శనం కోసం వచ్చిన మహబూబా బాద్‌కు చెందిన ముగ్గురు మహిళలతో చనువు ఏర్పడింది.
ఐదు రోజులుగా ఆలయ ఆవరణలో నిద్ర చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో పాప తల్లి మతిస్థిమితం లేకపోవడం కారణంగా పాపను సరిగ్గా చూసుకోవడం లేదని గమనించిన ముగ్గురు మహిళలు లాస్యను నమ్మించి గత డిసెంబర్ 23వ తేదీన వారితో పాటు తీసుకువెళ్లారు.
పాప అదృశ్యం కావడంతో తన మేనమామ పాలమూరు గంగస్వామి వేములవాడ టౌన్ లో గత ఏడాది 30వ తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆధ్వర్యంలో వేములవాడ సిఐ వీర ప్రసాద్,లు పోలీస్ సిబ్బందితో కలిసి, ఏడు స్పెషల్ టీం గా ఏర్పడి సాకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ. వేముల వాడ బస్టాండు రైల్వేస్టేషన్లో సిసి ఫుటేజ్ పరిశీలించి, మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామం లో పాప ఉన్నట్లు గుర్తించారు.
ఆ గ్రామ ఉపసర్పంచ్ సహాయంతో నిందితులైన శ్రీ రామోజీ వెంకట నరసమ్మ, గంభీరపు అంజవ్వ, కూనపురి ఉప్పలమ్మ, నుండి పాపను కాపాడి ఆ ముగ్గురు మహిళను అరెస్టు చేసి ఈరోజు రిమాండ్ కు తరలించారు.
బాలిక కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులను రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,అభినందించారు ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిఐలు వీరప్రసాద్,సదన్ కుమార్, ఎస్సైలు సుధాకర్, రమేష్, పోలీస్ సిబ్బంది,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.