కేటీఆర్ చెప్తేనే చేసాం.. ఏసీబీ ముందు ఒప్పుకున్న ఐఏఎస్ అధికారి..! ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించింది ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపుకు సంబంధించి అరవింద్ కుమార్ ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేసింది ఏసిబి. విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక ఉన్న అసలు కోణం ఏంటి… ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు.. ఎవరికి ప్రయోజనం …

కేటీఆర్ చెప్తేనే చేసాం.. ఏసీబీ ముందు ఒప్పుకున్న ఐఏఎస్ అధికారి..!

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించింది ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపుకు సంబంధించి అరవింద్ కుమార్ ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేసింది ఏసిబి.

విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక ఉన్న అసలు కోణం ఏంటి… ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు.. ఎవరికి ప్రయోజనం జరిగింది.. నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా .. అసలు 55కోట్లు నిధుల విదేశీ అకౌంట్లు కు జమ చేయడం ఎవరి నిర్ణయం అని ప్రశ్నించారు.

అయితే కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరి ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎందుకు నిధులు రిలీజ్ చేశారు..

కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు రిలీజ్ చేసేందుకు ఎవరు అనుమతిచ్చారు.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా .. బ్యాంక్ ఎలా నగదు బదిలీ చేసింది.

ఎఫ్‌ఈవోతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి.. ఆ అగ్రిమెంట్‌లో ఉన్న నిబంధనలు ఏంటి.. గ్రీన్ కో స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగడానికి కారణం ఏంటి.. 2024 ఒప్పందం ప్రకారం నిర్వహించాల్సిన ఫార్ములా ఈ కార్ రేస్ ఎందుకు నిర్వహించలేక పోయారు అని అరవింద్ కుమార్ ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏసిబి.

Updated On 10 Jan 2025 10:35 PM IST
cknews1122

cknews1122

Next Story