కలెక్టరేట్‌లో రసాభాసా.. అందరిముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు! కరీంనగర్ కలెక్టరేట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరగటంతో తోపులాటకు దారితీసింది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. సంజయ్ మాట్లాడుతుండగా.. ఈ మేరకు సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగా సంజయ్ది ఏ పార్టీ అంటూ కౌశిక్ నిలదీయడంతో గొడవ మొదలైంది. దీంతో ఒకరిపైకి ఒకరు దూసుకురాగా అక్కడుతన్న వారంతా అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ …

కలెక్టరేట్‌లో రసాభాసా.. అందరిముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు!

కరీంనగర్ కలెక్టరేట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరగటంతో తోపులాటకు దారితీసింది.

దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి.

సంజయ్ మాట్లాడుతుండగా..

ఈ మేరకు సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగా సంజయ్ది ఏ పార్టీ అంటూ కౌశిక్ నిలదీయడంతో గొడవ మొదలైంది. దీంతో ఒకరిపైకి ఒకరు దూసుకురాగా అక్కడుతన్న వారంతా అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆగకుండా కౌశిక్ రెడ్డి ముందుకు దూసుకెళ్లడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పరస్పరం చేయి చేసుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీసులు బయటకు తీసుకెళ్లారు. అయితే ఈ సమావేశఃలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు ఉండటం గమనర్హం. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Updated On 12 Jan 2025 6:25 PM IST
cknews1122

cknews1122

Next Story