భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను రోకలి బండతో ఆయన ఇద్దరు భార్యలు కొట్టి చంపారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండా లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను రోకలి బండతో ఆయన ఇద్దరు భార్యలు కొట్టి చంపారు.
ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతుడి ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.