మహబూబాబాద్‌లో దారుణం.. వివాహితను హత్యచేసి పాతిపెట్టిన అత్తింటివారు, శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యితో పిండి వంటలు, మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టారు అత్తింటివారు. అంతేగాదు శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసి పైశాచికాన్ని ప్రదర్శించారు. మహబూబాబాద్ లోని సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్న నాగమణి (35) అనే వివాహితను చంపి ఇంటి ఆవరణలోని కట్టెల పొయ్యి వద్ద పూడ్చి …
మహబూబాబాద్‌లో దారుణం.. వివాహితను హత్యచేసి పాతిపెట్టిన అత్తింటివారు, శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యితో పిండి వంటలు,
మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టారు అత్తింటివారు. అంతేగాదు శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసి పైశాచికాన్ని ప్రదర్శించారు.
మహబూబాబాద్ లోని సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్న నాగమణి (35) అనే వివాహితను చంపి ఇంటి ఆవరణలోని కట్టెల పొయ్యి వద్ద పూడ్చి పెట్టారు అత్త కాటి లక్ష్మి, మామ కాటి రాములు, ఆడపడుచు దుర్గా, భర్త గోపి. దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాతిపెట్టిన చోట తవ్వుతుండగా నాగమణి మృతదేహం బయటపడింది. ఇంటికి తాళం వేసి పరారయ్యారు మృతురాలి అత్త, మామ, భర్త, ఆడపడుచు. స్థానికంగా విషాదాన్ని నింపింది ఈ ఘటన.