రాష్ట్రంలో మరో సంచలనం.. వైద్య విద్యార్థిపై అత్యాచారం మైనర్ బాలికపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంచలన ఘటన ఆదిలాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ రిమ్స్ లో చదివే విద్యార్థిని(17)కి రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ (22) అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. అనంతరం వారి స్నేహం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని శివ, సదరు యువతికి మాయమాటలు చెప్పాడు. అతడి మాటలను గుడ్డిన నమ్మిన ఆ …
రాష్ట్రంలో మరో సంచలనం.. వైద్య విద్యార్థిపై అత్యాచారం
మైనర్ బాలికపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంచలన ఘటన ఆదిలాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ రిమ్స్ లో చదివే విద్యార్థిని(17)కి రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ (22) అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది.
అనంతరం వారి స్నేహం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని శివ, సదరు యువతికి మాయమాటలు చెప్పాడు. అతడి మాటలను గుడ్డిన నమ్మిన ఆ బాలిక ఈ నెల 9న ఒంటరిగా సికింద్రాబాద్ కు వచ్చింది.
అయితే, పరిస్థితులను అదునుగా చేసుకున్న శివ, మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఇంటికి పంపించేశాడు. అయితే, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధితురాలు భయంతో జరిగిన విషయం ఇంట్లో చెప్పేసింది.
అనంతరం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడి శివపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.