1.150 కేజీల ఎండు గంజాయి స్వాధీనం. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), జనవరి 17, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ తిరుపతి ఆదేశాల మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ, సీ హెచ్. శ్రీనివాస్ మరియు సిబ్బంది కూనవరం రోడ్ లోని ఆర్టిఏ కార్యాలయం ఎదురుగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మల్లె …

1.150 కేజీల ఎండు గంజాయి స్వాధీనం.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

జనవరి 17,

ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ తిరుపతి ఆదేశాల మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ, సీ హెచ్. శ్రీనివాస్ మరియు సిబ్బంది కూనవరం రోడ్ లోని ఆర్టిఏ కార్యాలయం ఎదురుగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మల్లె శివ మరియు శీలం మోహన్ కృష్ణ లు గుంటూరుకు భద్రాచలం మీదుగా సీలేరు నుండి ఎండు గంజాయి బజాజ్ పల్సర్ బైక్ మీద 1.150 కేజీల ను తరలిస్తున్నారని సమాచారం మేరకు అదుపులోకి తీసుకుమారు.

వీరి వద్ద ఒక సెల్ ఫోన్, పల్సర్ బైక్, ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుమారు. తదుపరి విచారణ నిమిత్తం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. ఈ తనిఖీల లో హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుల్స్ సుధీర్, హరీష్, వెంకట్,విజయ్, హనుమంతరావు, ఉపేందర్ పాల్గొన్నారు.

Updated On 17 Jan 2025 10:17 PM IST
cknews1122

cknews1122

Next Story