నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు రాత్రికి రాత్రి 90 కి పైగా రిజిస్ట్రేషన్లు చేయడం ఆ సబ్ రిజిస్ట్రార్ కే చెల్లింది వైరా సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మరికొందరు సబ్ రిజిస్ట్రార్ లపై వేటు పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం రాత్రికి రాత్రి 90 కి పైగా రిజిస్ట్రేషన్లు చేయడం ఆ సబ్ రిజిస్ట్రార్ కే చెల్లింది. అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేసి ఒక్క రాత్రికి 90కి పైగా డాక్యుమెంట్లు చేయడం తెలంగాణ …

నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు

రాత్రికి రాత్రి 90 కి పైగా రిజిస్ట్రేషన్లు చేయడం ఆ సబ్ రిజిస్ట్రార్ కే చెల్లింది

వైరా సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

మరికొందరు సబ్ రిజిస్ట్రార్ లపై వేటు పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం

రాత్రికి రాత్రి 90 కి పైగా రిజిస్ట్రేషన్లు చేయడం ఆ సబ్ రిజిస్ట్రార్ కే చెల్లింది. అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేసి ఒక్క రాత్రికి 90కి పైగా డాక్యుమెంట్లు చేయడం తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించింది.

పైరవీల ఒత్తిడో లేక అమ్యామ్యాలకు తలొగ్గాడో తెలియదు కానీ ఆ రిజిస్ట్రేషన్లే సదరు అధికారి కొంపముంచాయి. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినందుకు గాను సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు పడింది.

వివరాల్లోకెళితే ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ ఇటీవలే స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా 90 కి పైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన విషయం బయటపడటంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు వైరా సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

అయితే వైరా సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ తో మరికొంతమంది అవినీతి అధికారుల్లో సస్పెన్షన్ గుబులు పట్టుకుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. త్వరలోనే నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసిన మరికొందరు సబ్ రిజిస్ట్రార్ లపై వేటు పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

Updated On 17 Jan 2025 11:44 AM IST
cknews1122

cknews1122

Next Story