యదేచ్ఛగా బహిరంగంగా బెల్ట్ షాపులు నిర్వహణ… కన్నెత్తి చూడని అధికారులు పట్టించుకోని ఎక్సైజ్ శాఖ.. సికే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్ వాజేడు మండల పరిధిలో..వీధికి ఒక బెల్టు షాపు… పేరుకె కిరాణా దుకాణం…నడిపేది. మద్యం బెల్ట్ దందా…వైన్ షాప్ దక్కించుకున్న నిర్వాహకుడు చిన్న చిన్న బెల్టు షాపులకు మద్యాన్ని నేరుగా ఆటోలతో సప్లై చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.షాపు నిర్వాహకులకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా.. జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో …
యదేచ్ఛగా బహిరంగంగా బెల్ట్ షాపులు నిర్వహణ…
కన్నెత్తి చూడని అధికారులు పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..
సికే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
వాజేడు మండల పరిధిలో..వీధికి ఒక బెల్టు షాపు… పేరుకె కిరాణా దుకాణం…నడిపేది. మద్యం బెల్ట్ దందా…వైన్ షాప్ దక్కించుకున్న నిర్వాహకుడు చిన్న చిన్న బెల్టు షాపులకు మద్యాన్ని నేరుగా ఆటోలతో సప్లై చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.షాపు నిర్వాహకులకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా.. జోరుగా సాగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా బెల్ట్ షాపులను నిరోధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ,పల్లెలో మారుమూల తండాల్లో గ్రామాల్లో మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
అనేకమంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిన పాలవుతున్నారు.వాజేడు మండల పరిధిలో పలు గ్రామాల్లో బహిరంగంగా బెల్ట్ షాపులు ఎదేచ్చగా నిర్వహిస్తున్నారు.
అధిక సంఖ్యలో గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగుతూఉంటే నిరోధించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనం ఉపాధి కల్పిస్తుంటే మరోవైపు బెల్ షాపులు పల్లె ప్రజలను మత్తులో ముంచుతున్నారు.
ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదని బహిరంగంగా ప్రజల ఆరోపిస్తున్నారు.మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది. ఊరు ఊరు బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి.
దీంతో పొద్దంతా పనిచేసే సంపాదించిన సొమ్మును మద్యానికి విచ్చేస్తూ, కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహించడంతో యువత పెడదారి పడుతున్నారు.అనేకమంది పేరుకే కిరాణ దుకాణం నిర్వహిస్తూ, లోపల మాత్రం మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు.
మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పెడుతూ, అర్థరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నిద్ర మత్తు వీడి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.