కబ్జాలతో కుంచించుకు పోతున్న ఖానాపురం చెరువు
కబ్జాలతో కుంచించుకు పోతున్న ఖానాపురం చెరువు ఖానాపురం చెరువుని రక్షించండి మహా ప్రభో…… అధికారులకు సిపిఎం వినతి సికె న్యూస్ ప్రతినిధిఖానాపురం హవేలి : ఖానాపురం చెరువు చుట్టూ ఉన్న ప్రాంతం మరియు చెరువుకి వెళ్లడానికి ఇల్లెందు మెయిన్ రోడ్ నుంచి డొంక రోడ్డు చెరువు చుట్టూ ఉన్న డొంక రోడ్డు క్రమేపి ఆక్రమణలకు గురవుతున్నదని, ఈ ఆక్రమణల వలన రాను రాను చెరువు కుంచించుకు పోతున్నదని అడిగే వారు లేక కబ్జాదారులు ఇస్టారీతిగా చెరువు స్థలాన్ని …
![కబ్జాలతో కుంచించుకు పోతున్న ఖానాపురం చెరువు కబ్జాలతో కుంచించుకు పోతున్న ఖానాపురం చెరువు](https://cknewstv.in/wp-content/uploads/2025/01/IMG-20250120-WA0070.jpg)
కబ్జాలతో కుంచించుకు పోతున్న ఖానాపురం చెరువు
ఖానాపురం చెరువుని రక్షించండి మహా ప్రభో……
అధికారులకు సిపిఎం వినతి
సికె న్యూస్ ప్రతినిధి
ఖానాపురం హవేలి : ఖానాపురం చెరువు చుట్టూ ఉన్న ప్రాంతం మరియు చెరువుకి వెళ్లడానికి ఇల్లెందు మెయిన్ రోడ్ నుంచి డొంక రోడ్డు చెరువు చుట్టూ ఉన్న డొంక రోడ్డు క్రమేపి ఆక్రమణలకు గురవుతున్నదని,
ఈ ఆక్రమణల వలన రాను రాను చెరువు కుంచించుకు పోతున్నదని అడిగే వారు లేక కబ్జాదారులు ఇస్టారీతిగా చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, ఇదంతా గతంలో ఉన్న మరియు ప్రస్తుత అధికార పార్టీ నాయకుల అండదండలతో, అధికార బలంతో జరుగుతున్నదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ ఆరోపించారు,
తక్షణమే అధికారులు స్పందించి ఖానాపురం చెరువును కబ్జాదారుల నుండి రక్షించి చెరువు చుట్టూ ఉన్న డొంక రోడ్డును ఫార్మేషన్ చేయాలని, ఇల్లందు మెయిన్ రోడ్డు నుండి చెరువు కట్టకు వెళ్లే దారిని కూడా రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం ఖానాపురం హవేలీ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ఖానాపురం చెరువును, కబ్జాకు గురైన స్థలాలను పరిశీలించడం జరిగింది,
ఈ సందర్భంగా సిపిఎం హవేలి మండల కార్యదర్శి దొంగల తిరుపతిరావు మాట్లాడుతూ గతంలో ఈ చెరువు నుండి నీటిని వ్యవసాయ భూములకు వాడుకునే వారని క్రమేపి ఖమ్మం నగరం విస్తరణలో భాగంగా ఖానాపురం గ్రామం కూడా విస్తరించి చిన్నచిన్న కాలనీలు, ప్రాంతాలుగా విస్తరించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మురికి నీటితోపాటు పైన ఉన్న పాండురంగాపురం, జయనగర్ డ్రైనేజీ వాటర్ అంతా చెరువులోకి వదలటం వల్ల చెరువులో నీరు కూడా కలుషితమై చేపలు పట్టుకునే బెస్త వారికి కూడా ఇబ్బందికరంగా తయారైందని,
అలాగే చెరువు అలుగు వద్ద రంధ్రం పడి నీరు వృధాగా కిందకు పోతుందని వృధాగా పోయే నీటిని ఆగేవిధంగా చర్యలు చేపట్టాలని, ఈ సమస్యలపై ఖమ్మం కమిషనర్ చొరవ తీసుకొని చెరువు నీరు కలుషితం కాకుండా చూడాలని కోరారు, లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పిన్నింటి రమ్య, ఎస్ నవీన్ రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు పోతురాజు వెంకటి, కత్తుల అమరావతి, గాలి వెంకటాద్రి, మండల నాయకులు జట్ల ఆనందరావు, నల్లమల సత్యనారాయణ, మాచర్ల గోపాల్, వేదగిరి మురహరి, గడిపల్లి వెంకటేశ్వరరావు, స్థానికులు రామాచారి, వాకధాని శ్రీహరి, బుడిగ శ్రీను, పిన్నింటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)