ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా…
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా... ఏలూరు బుట్టాయిగూడెం: ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లిచేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె తెలిపిన ప్రకారం… బుట్టాయిగూడెం మండలం అరుంధతి కాలనీకి చెందిన మర్రి ప్రణీత, అదే గ్రామానికి చెందిన ఉందుర్తి నవీన్ కుమార్ S/o( ప్రకాష్) గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. మైనార్టీ తీరేంతవరకు ప్రేమ వ్యవహారం సాగించి, తనకు (ప్రణీత) 18 సంవత్సరాలు నిండిన …
![ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా… ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా…](https://cknewstv.in/wp-content/uploads/2025/01/Screenshot_2025_0121_194605.jpg)
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా...
ఏలూరు బుట్టాయిగూడెం: ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి
చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.
ఆమె తెలిపిన ప్రకారం… బుట్టాయిగూడెం మండలం అరుంధతి కాలనీకి చెందిన మర్రి ప్రణీత, అదే గ్రామానికి చెందిన ఉందుర్తి నవీన్ కుమార్ S/o( ప్రకాష్) గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.
మైనార్టీ తీరేంతవరకు ప్రేమ వ్యవహారం సాగించి, తనకు (ప్రణీత) 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఏడాది ఇంట్లో నుంచి తీసుకువెళ్లి విజయవాడలోని ఒక ప్రైవేటు రూమ్ లో ఉంచినట్లు తెలిపింది.
అనంతరం బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తన ప్రియుడు నవీన్ ఆమెను అతని ఇంటికి తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది.
కొన్ని నెలలు ప్రియుడు ఉందుర్తి నవీన్ ఆమెతో సహజం చేసి పెళ్లి చేసుకోమని అడగగా తన కుటుంబీకులు ఒప్పుకోవడం లేదని నీవు నీ ఇంటికి వెళ్ళిపోతే మంచిదని ఆమెను హెచ్చరించి నడిరోడ్డు పైన విడిచి పెట్టేసాడని ఆమె విలపించింది.
నువ్వంటే చచ్చేంత ఇష్టం అని, నువ్వు లేకపోతే బ్రతకలేను అంటూ మాయమాటలతో నమ్మించి, పెళ్లి చేసుకుంటానంటూ తన వెనక తిరిగి ఇప్పుడు వాళ్ల కుటుంబ పెద్దలు ఒప్పుకోవడం లేదని పెళ్లికి నిరాకరించినట్లు ఆమె గగ్గోలు పెట్టింది..
తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె నిలదీయడంతో ఆమెపై దుర్భాషలాడి, తన వెంట వచ్చిన ఆమె తల్లి,పిన్ని పై నవీన్ కొటంబికులు దాడి చేసి బయటకు నెట్టేసారని ఆమె వివరించింది. ఆమెను వదిలించుకునేందుకు కుట్ర చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె వాపోయింది.
దీంతో తాను మోసపోయానని తెలుసుకుని సోమవారం నవీన్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించింది. తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తానని ప్రణీత చెప్పింది..
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)