కేటీఆర్ కు పగలే చుక్కలు చూపిస్తాం..! రైతులపై అధ్యయన కమిటీ పేరిట "బీఆర్ఎస్" ముసలి కన్నీరు రైతు సమస్యలంటూ సినిమా షూటింగుల్లా పూలు చల్లించుకుంటున్నారు ఫామ్ హౌస్ లో పడుకొని రైతు అధ్యయనాలా..? పదేళ్లు గుడ్డి గాడిద పళ్ళు తోమారా..? షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక రైతుల్లో …

కేటీఆర్ కు పగలే చుక్కలు చూపిస్తాం..!

రైతులపై అధ్యయన కమిటీ పేరిట "బీఆర్ఎస్" ముసలి కన్నీరు

రైతు సమస్యలంటూ సినిమా షూటింగుల్లా పూలు చల్లించుకుంటున్నారు

ఫామ్ హౌస్ లో పడుకొని రైతు అధ్యయనాలా..?

పదేళ్లు గుడ్డి గాడిద పళ్ళు తోమారా..?

షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక రైతుల్లో ప్రజాదారణ కోల్పోతామని అభద్రతతో ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ రైతులపై ముసలి కన్నీరు కారుస్తుందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్ లు విమర్శించారు.

మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన విభాగం కోఆర్డినేటర్ రఘునాయక్ లు మాట్లాడారు. రైతు రుణమాఫీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ప్రాబల్యం వల్ల టిఆర్ఎస్ అబద్ధతభావంలో పడిందని ఆ లోటు పూడ్చుకునేందుకు కేటీఆర్ హరీష్ రావు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

మిర్చి రైతుల చేతులకు సంకెళ్లు వేసి జైల్లపాలు చేసిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు రైతులపై ముసలి కన్నీరు కారుస్తుండడం గమనర్హమని అన్నారు. గత పదివేలు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారు చెప్పాలన్నారు.

గుడ్డి గాడిద పళ్ళు తోమేరా అని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ఏళ్ల తరబడి నమ్మించి వంచించిన కెసిఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసి రాష్ట్రవ్యాప్తంగా 21 వేల కోట్లు ఖజానా నుండి చెల్లిస్తే ఇది చూసి తట్టుకోలేకపోతున్నారని అన్నారు.

రైతుల్లో టిఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న నష్టాన్ని సమర్థించుకునే విధంగా కేటీఆర్ ఇటీవల షాబాద్ పర్యటనలో హల్చల్ చేశారని అన్నారు. రైతుల సమస్యలను వినడానికి వచ్చిన కేటీఆర్ ప్రోక్లైన్ వాహనాల ద్వారా పూలు చెల్లించుకోవడం సినిమా షూటింగులను తలదన్నేలా షోపుటప్ చేయడం ప్రజలు రైతులు గమనిస్తున్నారని వారు అన్నారు.

ఒక్క ఏడాదికే నానా అగచాట్లు పడుతున్న కేటీఆర్ హరీష్ రావు తదితర నాయకులు అధికారం కోసం ఉబలాటం ఎక్కువైందని అన్నారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వ జీతాలు తీసుకొని ఫామ్ హౌస్ లో తప్ప తాగి పడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

ఫామ్ హౌస్ లో పండుకొని ఆయన రైతులపై అధ్యయనం చేస్తున్నారా అంటూ ఘాటుగా విమర్శించారు. కేంద్రంలో గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా రైతాంగానికి రుణమాఫీ చేసిన ఘనత తమ కాంగ్రెస్ పార్టీదని అన్నారు.

తమది ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ పార్టీ అని ఇది గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ కు సూచించారు. అడ్డమైన కేసులో ఇరుక్కున్న కేటీఆర్ సంయమనం కోల్పోయి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తా అంటున్నాడని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కేటీఆర్ కు పగలే చుక్కలు చూపిస్తుందని అన్నారు.

ఈనెల 26 నుండి రైతులకు కూలీలకు రైతు భరోసా ఇస్తామని అన్నారు. ఇది చూసి తట్టుకోలేక రైతులపై అధ్యాయనం పేరిట ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రైతాంగానికి ఏం చేశారు చెప్పాలని డిమాండ్ చేశారు.

టిఆర్ఎస్ పాలనలో సబ్సిడీలు ఎత్తివేసి అదేవిధంగా నాసిరకమైన ప్రాజెక్టులు కట్టి వారి జీవితాలతో చెలగాటమాడాలని వారి పుణ్యాన రైతులు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ నాయకులు దుమ్మెత్తి పోశారు. టిఆర్ఎస్ బూటకపు కమిటీలను ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు.

గతంలో రాష్ట్ర అభివృద్ధి పేరిట విదేశాల్లో పర్యటించిన కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి విదేశాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం పర్యటిస్తుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో వీర్లపల్లి మహబూబ్ సయ్యద్ ఖదీర్ రమేష్ బచ్చలి నరేష్ శ్రీహరి గౌడ్ డైరెక్టర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..

Updated On 21 Jan 2025 2:14 PM IST
cknews1122

cknews1122

Next Story