తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్..జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..!!
Weather Report: తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. నేడు, రేపు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడుతుండటంతో తమిళనాడుకు బలమైన గాలులు వీస్తున్నాయి.దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీ, తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేనప్పటికీ చలి విపరీతంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..వీలైనంత వరకు రాత్రిళ్లు ఇళ్ల …
Weather Report: తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. నేడు, రేపు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడుతుండటంతో తమిళనాడుకు బలమైన గాలులు వీస్తున్నాయి.
దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీ, తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేనప్పటికీ చలి విపరీతంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..వీలైనంత వరకు రాత్రిళ్లు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ సూచించారు.
శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాల్లోమేఘాలు చాలా తక్కువగా ఉంటాయి. రోజంతా పొడి వాతావరణం ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరుగుతుంది. ఏపీ కంటే తెలంగాణలో చలి మరింత ఎక్కువగా ఉంటుంది. గాలివేగం బంగాళాఖాతంలో గంటకు 30కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో ఇది గంటకు 14కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 11కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం గాలులన్నీ శ్రీలంకవైపే వీస్తున్నాయి. అక్కడ అల్పపీడనం పెద్దగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నాయి. నేడు తెలంగాణలో పగటివేళ 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో 17 డిగ్రీలు, ఏపీలో 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని ఐఎండీ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ, అడవి ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. పగటివేళ కంటే రాత్రివేళ తేమ బాగా పెరుగుతుందని..రాత్రిళ్లు చలి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ తెలిపింది. పిల్లలు, ముసలివారు, ఆస్తమా బాధితులు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Weather Report: తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్..జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..!!