ప్రభుత్వ ఆస్పత్రిలో ఉరేసుకుని పేషెంట్ ఆత్మహత్య మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి నారమ్మ(32) ఆసుపత్రి బాత్రూం లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దామరగిద్ద మండలం,కందన్ పల్లి గ్రామానికి చెందిన నారమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ తన మేనల్లుడు నరేష్ తో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యింది. మంగళవారం ఉదయం బాత్రూమ్ అని చెప్పి వెళ్ళి అరగంట …

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉరేసుకుని పేషెంట్ ఆత్మహత్య

మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి నారమ్మ(32) ఆసుపత్రి బాత్రూం లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

దామరగిద్ద మండలం,కందన్ పల్లి గ్రామానికి చెందిన నారమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ తన మేనల్లుడు నరేష్ తో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యింది.

మంగళవారం ఉదయం బాత్రూమ్ అని చెప్పి వెళ్ళి అరగంట దాటిన తిరిగి రానందున మేనల్లుడు నరేష్ బాత్ రూమ్ లోకి వెళ్లి చూడగా బాత్ రూమ్ లో ఫ్యాన్ కు చున్నీ తో ఉరి వేసుకొని కనిపించిందని నరేష్ తెలుపగా, హుటాహుటిన ఆసుపత్రి సిబ్బంది ఆమె కిందికి దించి పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

అయితే రాత్రి డ్యూటీలో ఉన్న నర్సులు వైద్య సేవలు అందించే క్రమంలో నారమ్మ ను దుర్భాషలు ఆడారని ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated On 22 Jan 2025 10:19 AM IST
cknews1122

cknews1122

Next Story