ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు... హైదరాబాద్ లో నిన్నటి నుంచి ప్రముఖ తెలుగు నిర్మాతల ఇళ్ళు, కార్యాలయాల మీద ఐటీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎస్వీసీ, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, వృద్ధి మీడియా కార్యాలయాలపై సోదాలు జరుగుతున్నాయి. కాగా ఈ దాడులపై ఎస్వీసీ అధినేత దిల్ రాజు మొదటిసారి నోరు విప్పారు. కేవలం నా ఒక్కడి మీదనే ఐటీ దాడులు జరగడం లేదని, ఇండస్ట్రీలో అందరిపై జరుగుతున్నాయని అన్నారు. …
ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు...
హైదరాబాద్ లో నిన్నటి నుంచి ప్రముఖ తెలుగు నిర్మాతల ఇళ్ళు, కార్యాలయాల మీద ఐటీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఎస్వీసీ, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, వృద్ధి మీడియా కార్యాలయాలపై సోదాలు జరుగుతున్నాయి. కాగా ఈ దాడులపై ఎస్వీసీ అధినేత దిల్ రాజు మొదటిసారి నోరు విప్పారు.
కేవలం నా ఒక్కడి మీదనే ఐటీ దాడులు జరగడం లేదని, ఇండస్ట్రీలో అందరిపై జరుగుతున్నాయని అన్నారు. కేవలం మా సంస్థ మీద, నా మీద మాత్రమే ఈ తనిఖీలు జరుగుతున్నట్టు మీడియాలో కథనాలు ప్రసారం చేయడం తగదన్నారు.
కాగా నిన్న, నేడు దిల్ రాజు, యెర్నేని నవీన్, యలమంచిలి రవి శంకర్ ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు జరువుతున్నారు.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.