నాన్నతో కలిసి నా చిన్నతనంలో శిలపలు తొక్కేది ఉండేది హైదరాబాద్ లో… పుట్టి పెరిగింది నారాయణపురంలోనే మహిళా కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సికె న్యూస్ ప్రతినిధినేలకొండపల్లి : నాకు వ్యవసాయం చేయడం వచ్చు…. వ్యవసాయం పై నాకూ అవగాహన ఉంది…. నాన్న బతికున్నప్పుడు ఆయనతో కలిసి నా చిన్నతనంలో పొలంలో శిలపలు తొక్కేది… ఉండేది మాత్రమే హైదరాబాద్ నేను పుట్టి పెరిగింది కల్లూరు మండలం నారాయణపురంలోనేనని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల …

నాన్నతో కలిసి నా చిన్నతనంలో శిలపలు తొక్కేది

ఉండేది హైదరాబాద్ లో… పుట్టి పెరిగింది నారాయణపురంలోనే

మహిళా కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సికె న్యూస్ ప్రతినిధి
నేలకొండపల్లి : నాకు వ్యవసాయం చేయడం వచ్చు…. వ్యవసాయం పై నాకూ అవగాహన ఉంది…. నాన్న బతికున్నప్పుడు ఆయనతో కలిసి నా చిన్నతనంలో పొలంలో శిలపలు తొక్కేది…

ఉండేది మాత్రమే హైదరాబాద్ నేను పుట్టి పెరిగింది కల్లూరు మండలం నారాయణపురంలోనేనని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా కొంగర సమీపంలోని పొలాల వద్ద పని చేస్తున్న మహిళా కూలీలను చూసి ఆయన కాన్వాయ్ ఆపారు…. వారి వద్దకు వెళ్లి అక్కా చెల్లి అంటూ వారితో సరదాగ కాసేపు ముచ్చటించారు…. ఈ నెల 26వ తేదీ నుంచి అమలు కాబోతున్న పథకాల గురించి వారికి వివరించారు.

ఆ పథకాల జాబితాలో పేర్లు రాని వారు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో పేర్లు నమోదు చేసుకుంటే పరిశీలించి ఆ పథకాలను అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే పెన్షన్లు కూడా ఇస్తామని వారితో చెప్పారు…. అక్క చెల్లమ్మలందరూ గాజులు వేయించుకోండని చెబుతూ కొంత నగదు అందజేశారు.

Updated On 22 Jan 2025 2:58 PM IST
cknews1122

cknews1122

Next Story