హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్‌ స్కామ్‌ కలకలం.. ఆ ఆస్పత్రి సీజ్‌ ప్రైవేట్ హాస్పిటల్స్ లలో అక్రమ దందా కొనసాగుతోంది. పేరుకు మాత్రం ఆస్పత్రులు ఏర్పాటు చేసి చీకటి దందాలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా కిడ్నీలు మార్పిడి చేస్తున్న సంఘటన మంగళవారం సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో గల అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వెలుగుచూసింది. అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన నలుగురిని తీసుకువచ్చి కిడ్నీలు …

హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్‌ స్కామ్‌ కలకలం.. ఆ ఆస్పత్రి సీజ్‌

ప్రైవేట్ హాస్పిటల్స్ లలో అక్రమ దందా కొనసాగుతోంది. పేరుకు మాత్రం ఆస్పత్రులు ఏర్పాటు చేసి చీకటి దందాలు చేస్తున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా కిడ్నీలు మార్పిడి చేస్తున్న సంఘటన మంగళవారం సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో గల అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వెలుగుచూసింది.

అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన నలుగురిని తీసుకువచ్చి కిడ్నీలు మార్పిడి చేస్తున్నారు. స్థానికంగా ఉండే కొన్ని ఆసుపత్రులతో కుమ్మక్కై అమాయకుల్ని ఆసరాగా చేసుకొని కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నారు.

డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లను ఆసుపత్రికి తీసుకొచ్చి కిడ్నీలను మార్పిడి చేస్తూవాటిని అమ్ముకుని లక్షలలో డబ్బులు దండుకుంటున్నారు. జిల్లా వైద్య శాఖ నుండి 9 బెడ్ల పర్మిషన్ తీసుకొని నాలుగు ఫ్లోర్లు బెడ్లతో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.

ఉజ్బెకిస్తాన్ లో చదివిన డాక్టర్ పేరిట పర్మిషన్ ఉండగా ఒక ఫిజీషియన్, ఒక ప్లాస్టిక్ సర్జన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి ఉన్నది. యూరాలజిస్ట్ డాక్టర్ పర్మిషన్ ఆసుపత్రికి లేదు.

ఈ విషయం రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావుకు సమాచారం రావడంతో హాస్పిటల్ వద్దకు పోలీసుల సహకారంతో చేరుకొని తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు మొత్తం నలుగురిని బెడ్లపై ఉండడం చూశారు. ఇద్దరు పేషెంట్లు డోనర్స్, మరో ఇద్దరు పేషెంట్లు అమర్చుకున్న వారు ఉన్నట్లు గమనించారు.

పేషెంట్లకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ వాస్తవాల కోసం నాలుగు అంబులెన్స్ లలో నలుగురిని గాంధీ హాస్పిటల్ కు వైద్యాధికారులు తరలించారు. డాక్టర్లు పరారీలో ఉండగా అలకనంద హాస్పిటల్ ఎండి సుమంత్ చారీని, ఆసుపత్రి సిబ్బందిని సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు.

ఆసుపత్రిలో తనిఖీలు..

అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను డియంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వో గీతా, సరూర్‌నగర్‌ పి హెచ్ సి వైద్యురాలు అర్చన, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, ఏసీపీ కృష్ణయ్య, సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డి, సెక్టార్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌తో పాటు సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించి హాస్పిటల్ లో తనిఖీలు చేశారు. హాస్పిటల్ ను సీజ్ చేసి వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Updated On 22 Jan 2025 10:11 AM IST
cknews1122

cknews1122

Next Story