ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష..! ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు కోర్టు భారీ షాకిచ్చింది. పలు వివాదాల్లో ఇరుక్కున్న ఆయనకు ఇది భారీ షాక్‌గానే చెప్పుకోవచ్చు. ఓ చెక్కు బౌన్స్ కేసులో వర్మను ముంబైలోని అంధేరీ కోర్టు దోషిగా తేల్చింది. ఏకంగా ఆయనకు మూడు నెలలు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. తన జీవితంలో కొన్ని సంఘటనలతో తాను చాలా కోల్పోయానంటూ పశ్చాత్తాప పడుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ఆయనకు శరాఘాతమే. దర్శకుడు రామ్‌గోపాల్ …
ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష..!
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు కోర్టు భారీ షాకిచ్చింది. పలు వివాదాల్లో ఇరుక్కున్న ఆయనకు ఇది భారీ షాక్‌గానే చెప్పుకోవచ్చు. ఓ చెక్కు బౌన్స్ కేసులో వర్మను ముంబైలోని అంధేరీ కోర్టు దోషిగా తేల్చింది.
ఏకంగా ఆయనకు మూడు నెలలు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. తన జీవితంలో కొన్ని సంఘటనలతో తాను చాలా కోల్పోయానంటూ పశ్చాత్తాప పడుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ఆయనకు శరాఘాతమే.
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై 2018లో మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో చెక్కు బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఈ కేసు ఏడేళ్లుగా విచారణ కొనసాగుతున్నది.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వర్మ కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో అతనిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను కోర్టు దోషిగా నిర్ధారించారు.
వచ్చే మూడు నెలల్గోగా ఫిర్యాదుదారుడికి రామ్‌గోపాల్ వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది.
ఈ నేరం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందికి వస్తుందని, దీనికింద చిత్ర నిర్మాతపై చట్టపరమైన చర్య తీసుకున్నట్టు కోర్టు అభిప్రాయం వ్యక్తంచేసింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో వర్మకు ఒకసారిగా బెయిల్ కూడా లభించింది.