ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని బాధ్యులు చేయొద్దు సమాజంలో అందరూ సమానులే అందులో మేము ఒక భాగం మా జీవనోపాధి కోసమే భిక్షాటన చేస్తున్నాం తప్ప ఎటువంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడము ఖమ్మం జిల్లా హిజ్రా అసోసియేషన్ అధ్యక్షులు దోమల మేరీ సికె న్యూస్ ప్రతినిధిఖమ్మం జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా హిజ్రా అసోసియేషన్ అధ్యక్షులు దోమల మేరీ మాట్లాడుతూ మా జీవనోపాధి కోసం భిక్షాటన చేసుకుంటూ …

ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని బాధ్యులు చేయొద్దు

సమాజంలో అందరూ సమానులే అందులో మేము ఒక భాగం

మా జీవనోపాధి కోసమే భిక్షాటన చేస్తున్నాం తప్ప ఎటువంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడము

ఖమ్మం జిల్లా హిజ్రా అసోసియేషన్ అధ్యక్షులు దోమల మేరీ

సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా హిజ్రా అసోసియేషన్ అధ్యక్షులు దోమల మేరీ మాట్లాడుతూ మా జీవనోపాధి కోసం భిక్షాటన చేసుకుంటూ జీవించే వ్యక్తులము తప్ప దొంగతనాలకు , ఇతర ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ప్రోత్సహించే వ్యక్తులము కాదు.

ఎక్కడ ఏ తప్పు జరిగిన దానికి మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఎందుకంటే సమాజంలో మేము తేలికగా , చులకనగా కనిపించే వ్యక్తులము . మమ్మల్ని అర్థం చేసుకుని జీవించమనండి . ఎలాగో కుటుంబాలకు సమాజానికి దూరమై బ్రతుకుతున్నాం .

ఇప్పుడే సమాజంలో మేము గుర్తించబడుతున్నాం మా జీవితాలను చీకట్లోకి నెట్టకుండా కాపాడండి అని విలేకరుల సమావేశంలో ప్రార్థించారు .

ఈ కార్యక్రమంలో ఖమ్మం హిజ్రా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సోనీ , ఈసీ నెంబర్స్ ఆర్ మాధురి , రూప , నాగమణి తదితరులు పాల్గొన్నారు .

Updated On 23 Jan 2025 6:08 PM IST
cknews1122

cknews1122

Next Story