మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం? హైదరాబాద్:జనవరి 22మహారాష్ట్రలోని, జల్గావ్ లో ఈరోజు మధ్యాహ్నం రైలు ప్రమాదం చోటుచేసు కుంది, జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదశాత్తు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపించడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు. వారు ప్రయాణిస్తున్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణి కులు భయంతో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ నుంచి దూకారు. ప్రాణాలు కాపాడుకునేం దుకు కిందకు దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న బెంగుళూరు ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ …
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం?
హైదరాబాద్:జనవరి 22
మహారాష్ట్రలోని, జల్గావ్ లో ఈరోజు మధ్యాహ్నం రైలు ప్రమాదం చోటుచేసు కుంది, జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదశాత్తు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపించడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు.
వారు ప్రయాణిస్తున్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణి కులు భయంతో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ నుంచి దూకారు. ప్రాణాలు కాపాడుకునేం దుకు కిందకు దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న బెంగుళూరు ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు చైన్‌ను లాగారు. దీంతో ప్రయాణికులు రక్షించుకు నేందుకు ట్రాక్‌పై దూకినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో జల్గావ్ లో మరో వైపు అతివేగంతో వెళ్తున్న బెంగళూరు ఎక్స్ ప్రెస్‌తో ప్రయాణికులను అతివేగంతో ఢీకొట్టింది. జల్గావ్లోని పచోరాలోని పర్ధాడే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 35 నుంచి 40 మంది ప్రయాణి కులు ఎక్స్‌ప్రెస్ నుంచి దూకినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎక్స్‌ప్రెస్ లో పొగలు రావడంతో చైన్ లాగిన తర్వాత ప్రయాణి కులు రైలు దూకి దూకి ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహా యక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.