సీసీ రోడ్లు స్వంత జాగలక! లేక ప్రభుత్వ బజారులక! వేములపల్లి సీకే న్యూస్ జనవరి 23 అది బజారు కాకున్నా,వారి సొంత గృహానికి,సిసి రోడ్డు వేసిన, అధికారులు,కాంట్రాక్టర్ల నిర్వాహకం,ప్రభుత్వసొమ్ము రోడ్డు పాలు,కాదు కొందరి ఇంటిపాలు,పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం సీసీ రోడ్లను ఇటీవల మంజూరు చేయడంతో. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణలోపంతో,కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగా వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం …

సీసీ రోడ్లు స్వంత జాగలక! లేక ప్రభుత్వ బజారులక!

వేములపల్లి సీకే న్యూస్ జనవరి 23

అది బజారు కాకున్నా,వారి సొంత గృహానికి,సిసి రోడ్డు వేసిన, అధికారులు,కాంట్రాక్టర్ల నిర్వాహకం,ప్రభుత్వసొమ్ము రోడ్డు పాలు,కాదు కొందరి ఇంటిపాలు,
పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం సీసీ రోడ్లను ఇటీవల మంజూరు చేయడంతో. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణలోపంతో,కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగా వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో
ఎన్ఆర్జీఎస్ పథకంలో భాగంగా పది లక్షలరూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికిమంజూరుకాగా.
ఆగ్రామంలో సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లోపమో లేక కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కయ్యారో తెలియదు కానీ ఆ గ్రామంలోని వాళ్ళు కాలనీలో వేయాల్సిన సీసీ రోడ్లను కొంతమంది ఇంటి ఆవరణలో వేయడం ఎందని
గ్రామంలోని పలు వీధుల్లో వేయాల్సిన సీసీ రోడ్లను,ఇళ్లల్లో వేయాల్సిన అవసరం ఏముందని పలువురు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.బజార్లలో ఎస్తే స్వంత బాత్రూం బజార్లో ఎలా ఉందని ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని ఆరోపించారు.సిసి రోడ్ నిర్మాణంలో ఇసుకకు బదులు డస్ట్ వాడి నాణ్యత లేకుండా చేసారని తక్షణమే సీసీ రోడ్ నిర్మాణ పనులపై విచారణ జరిపి కాంట్రాక్టర్ మరియు అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Updated On 23 Jan 2025 10:52 AM IST
cknews1122

cknews1122

Next Story