మంత్రి కి తృటిలో తప్పిన ప్రమాదం! రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజవర్గం హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయిలో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయితో కారులో వెలుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి …

మంత్రి కి తృటిలో తప్పిన ప్రమాదం!

రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజవర్గం హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయిలో ప్రమాదం చోటుచేసుకుంది.

కాన్వాయితో కారులో వెలుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి మంత్రి కారు ఆపారు.

డ్రైవర్ సడన్ గా కారును ఆపగా..మంత్రి కాన్వాయ్ లో వెనక వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

మంత్రి ఉత్తమ్ కు కారు ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Updated On 24 Jan 2025 11:35 AM IST
cknews1122

cknews1122

Next Story