మహిళ కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి ఫైర్...
మహిళ కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఫైర్ .. కామన్ సెన్స్ ఉందా అని ప్రశ్న..? వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్?.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఏం పని చేస్తున్నారు? "వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్?" అంటూ తీవ్రంగా కోపగించారు. అసలు నీకు కొంచెం అయినా కామన్ సెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. దాంతో ఆ మహిళ కలెక్టర్ …
మహిళ కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఫైర్ ..
కామన్ సెన్స్ ఉందా అని ప్రశ్న..?
వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్?..
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఏం పని చేస్తున్నారు? "వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్?" అంటూ తీవ్రంగా కోపగించారు. అసలు నీకు కొంచెం అయినా కామన్ సెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. దాంతో ఆ మహిళ కలెక్టర్ చాలా బాధపడింది.
అసలు ఏం జరిగింది..?
అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పర్యటించారు. కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీలో నీటి సరఫరా వ్యవస్థను మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు.
ఆ సందర్భంలో తెలంగాణ మంత్రి పొంగులేటిని పోలీసులు పక్కకు తోశారు . దీంతో మంత్రి స్థాయిలో ఉన్న తనకి ఇది అవమానంగా భావించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉండగా కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా ఆ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా మూసివేశారు. బారికేడ్లు వేసి స్థానికంగా ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టారు పోలీసులు. అలాగే వివిధ మార్గాలలో ఉన్న హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను ఉదయం నుంచి బంద్ చేయించారు.
కేంద్ర మంత్రి పర్యటనలో భాగంగా నీటి సరఫరా వ్యవస్థను ప్రారంభించారు. ఆ తర్వాత మల్టీపర్పస్ పార్క్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం కాంప్లెక్స్, స్మార్ట్ స్కూల్‌ను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు.
అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగించారు. ఆ తర్వాత డంపింగ్ యార్డును పరిశీలించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంలో జరిగిన ఓ సన్నివేషంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు.
నాయకులందరి ముందు ఒక జిల్లా కలెక్టర్‌ని ముఖం చూస్తూ సీరియస్ అయ్యారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. "ఎస్పీ ఎక్కడ?" అంటూ ప్రశ్నించారు గట్టిగా అడిగాడు. ఇంతలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని.. "కనీసం ఏసీపీ కూడా లేరు" అని అడిగారు. అయితే ఈ సందర్భం ఓ వీడియోలో రికార్డు అయ్యింది. ఇప్పుడు కలెక్టర్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నోరు పారేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.