205 కిలోల గంజాయి పట్టివేత కారు, సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం సి కె న్యూస్ విశాఖపట్నం ప్రతినిధి ( రవికుమార్ ) జనవరి 25 : అక్రమంగా తరలిస్తున్న 205 కిలోల గంజాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి కారు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పి తుహిన్ సిన్హా ఎస్సీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను …
205 కిలోల గంజాయి పట్టివేత
కారు, సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం
సి కె న్యూస్ విశాఖపట్నం ప్రతినిధి ( రవికుమార్ ) జనవరి 25 : అక్రమంగా తరలిస్తున్న 205 కిలోల గంజాయిని నర్సీపట్నం రూరల్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి కారు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పి తుహిన్ సిన్హా ఎస్సీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ముందస్తు సమాచారం మేరకు, నర్సీపట్నం రూరల్ సి.ఐ ఎల్.రేవతమ్మ, నర్సీపట్నం రూరల్ ఎస్.ఐ పి.రాజారావు, గొలుగొండ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఎం.రామారావు, నర్సీపట్నం శివారు నెల్లిమెట్ట, సాధుపాకలు వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో టీవీ9 స్టిక్కర్, ఫేక్ కారు నెంబర్‌తో చింతపల్లి వైపు నుండి నర్సీపట్నం వైపు వస్తున్న వాహనాలను పోలీస్ సిబ్బంది ఆపారు.
అందులో ఉన్న నిందితులు అజిత్ తంగరాజన్, అమల్ సురేష్, మర్రి సత్తిబాబు పారిపోతుండగా పోలీస్ సిబ్బంది. పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్టు ఎస్సి తుహిన్ సిన్హా తెలిపారు.
ఈ కేసులో సమాచారం సేకరించి గంజాయి పట్టుకున్న సిబ్బందిని నర్సీపట్నం సబ్ డివిజన్ డి.ఎస్.పి. పోతురెడ్డి శ్రీనివాసరావు, నర్సీపట్నం రూరల్ సిఐ ఎల్. రేవతమ్మ, నర్సీపట్నం రూరల్ ఎస్.ఐ.రాజారావు, గొలుగొండ ఎస్.ఐ. రామారావు, సిబ్బందిని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించి ప్రశంసా పత్రం, నగదు రివార్డులను అందించారు.