తెలంగాణలో మరో పరువు హత్య..! యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు తెలంగాణ రాష్ట్రం లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పిల్లలమర్రి గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడిని కొంతమంది దుండగులు అర్ధరాత్రి మాటు వేసి అత్యంత కిరాతకంగా బండరాళ్లతో తలపై మోది చంపేశారు. అనంతరం డెడ్‌బాడీ ని మూసీ కెనాల్ సమీపంలో పడేశారు. అయితే, 6 …

తెలంగాణలో మరో పరువు హత్య..! యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు

తెలంగాణ రాష్ట్రం లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆర్ధరాత్రి జరిగింది.

వివరాల్లోకి వెళితే.. పిల్లలమర్రి గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడిని కొంతమంది దుండగులు అర్ధరాత్రి మాటు వేసి అత్యంత కిరాతకంగా బండరాళ్లతో తలపై మోది చంపేశారు. అనంతరం డెడ్‌బాడీ ని మూసీ కెనాల్ సమీపంలో పడేశారు. అయితే, 6 నెలల క్రితం కృష్ణ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఇప్పటికే పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న అతడు దారుణ హత్యకు గురకావడంతో అంతా అయోమయం నెలకొంది. కృష్ణది పరువు హత్యనా.. లేక పాత కక్షలే కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 27 Jan 2025 9:29 AM IST
cknews1122

cknews1122

Next Story