ఆలయ ప్రాంగణంలో కత్తితో అఘోరి హల్చల్! సిద్దిపేట జిల్లా : కొమురవెల్లి మల్లన్న గుడిలో అఘోరి నాగసాధువు ఈరోజు నానా రచ్చ చేసింది, కత్తితో పలువురిపై దాడి చేస్తూ భక్తులను బయాంబ్రాంతులకు గురిచేసింది, ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండి పట్టు పట్టింది. పూర్తి దిగంబరంగా ఆలయానికి వచ్చిన అఘోరీ ఆలయం ప్రధాన ద్వారం నుంచి తనను దర్శనానికి అనుమతించాలంటూ హల్చల్ చేసింది. అయితే వస్త్రధారణతో దర్శనానికి వస్తే అనుమతినిస్తామంటూ ఆలయ …
ఆలయ ప్రాంగణంలో కత్తితో అఘోరి హల్చల్!
సిద్దిపేట జిల్లా : కొమురవెల్లి మల్లన్న గుడిలో అఘోరి నాగసాధువు ఈరోజు నానా రచ్చ చేసింది, కత్తితో పలువురిపై దాడి చేస్తూ భక్తులను బయాంబ్రాంతులకు గురిచేసింది, ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండి పట్టు పట్టింది.
పూర్తి దిగంబరంగా ఆలయానికి వచ్చిన అఘోరీ ఆలయం ప్రధాన ద్వారం నుంచి తనను దర్శనానికి అనుమతించాలంటూ హల్చల్ చేసింది. అయితే వస్త్రధారణతో దర్శనానికి వస్తే అనుమతినిస్తామంటూ ఆలయ అధికారులు సూచించారు.
తనను ఇలాగే దర్శనానికి అనుమతించాలంటూ ఆలయ అధికారులతో వాగ్వివాదానికి దిగిన అఘోరీ కత్తితో అక్కడున్న వారిపై ఆకస్మికంగాదాడి చేసింది. అఘోరీ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.
మొదటి నుంచి కూడా అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో తన వివాద్పద వైఖరితో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో పూజలతో వెలుగు లోకి వచ్చిన మహిళా అఘోరి శ్రీకాళహస్తి సహా ఏపీలోని పలు దేవాలయాల సందర్శనల సందర్భంగా గొడవకు దిగింది.
ఈ విషయంలో ఆలయ అధికారులు కూడా మొండి పట్టు పట్టారు. బట్టలు వేసుకుని దర్శనానికి రావాలని సూచించారు. భక్తులు ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.